పెద్దపల్లి జిల్లాకు మరో జాతీయ పురస్కారం వరించింది. ఇప్పటికే స్వచ్ఛసర్వేక్షణ్, స్వచ్ఛసుందర్ సౌచాలయ్, స్వచ్ఛ దర్పణ్‌లో గతంలోనే జాతీయ అవార్డులు సాధించగా, తాజాగా స్వచ్ఛ దర్పన్ అవార్డు-2020లో పెద్దపల్లి జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కింది. జిల్లాలో 100శాతం మరుగుదొడ్లు నిర్మించి వినియోగించడం, ప్రతి గ్రామంలో సామూహిక మరుగుదొడ్లు నిర్మించడంతో పాటు వాటికి జియో ట్యాటింగ్ పూర్తి చేయడం, గ్రామాల్లో వందశాతం ఇంకుడుగుంతలు నిర్మించి, మురుగుకాలువలు లేకుండా చేయడం, సామూహిక ఇంకుడుగుంతల నిర్మాణం.. చెత్తను సమర్థవంతంగా తొలగించడం, కంపోస్టు ఫిట్ నిర్మాణం, ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులను నిర్మించి వినియోగించడంతో పాటు స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించడం తదితర అంశాల్లో జిల్లా జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం దక్కిందని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది.
పెద్దపల్లికి స్వచ్ఛదర్పణ్ పురస్కారం